ఈ మార్గం ఎంతో విలక్షణం

Thursday,November 10,2016 - 03:42 by Z_CLU

నా దారి రహదారి అంటాడు రజనీకాంత్. క్రిష్ మాత్రం తనది విలక్షణమైన దారి అంటాడు. ఈ దర్శకుడు తెరకెక్కించే సినిమాలు చూస్తే అర్థమైపోతుంది.. క్రిష్ మార్గం ఏంటో. ఆ సినిమాలు క్రిష్ మాత్రమే తీయగలడు.

krish-_-01

మనుషుల మధ్య సంబంధాల్ని, అంతరాల్నిఅత్యంత సహజసిద్ధంగా, హృద్యంగా చూపించిన సినిమా ఇది. ఆల తన తొలి చిత్రంతోనే తన కెరీర్ గమ్యాన్ని నిర్దేశించుకున్నాడు క్రిష్. అలా మొదటి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు.

krish-_-02

కీలకమైన 5 పాత్రల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం వేదం. ఈ సినిమాలో ఒక పాత్రకు, ఇంకో పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ క్లయిమాక్స్ కు దగ్గరయ్యేకొద్దీ క్యారెక్టర్లన్నీ కలుస్తాయి. మనుషులంతా ఒక్కటే అని చాటుచెబుతాయి. క్రిటికల్ నెరేషన్ తో సాగే ఈ సినిమా… క్రిష్ కు ఏకంగా బెస్ట్ డైరక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది.

krish-_-03

టాలీవుడ్ లో హిట్ అయిన వేదం సినిమాకు రీమేక్ వెర్షన్ వానమ్. శింబు, అనుష్క లీడ్ క్యారెక్టర్స్ లో నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో కూడా హిట్ అయింది.

krish-_-04

అంతరించిపోతున్న సురభి అనే కళారూపానికి, ప్రస్తుతం నడుస్తున్న మైనింగ్ మాఫియాకు లింక్ పెడుతూ ఓ సినిమా తీయాలనే ఆలోచనే చాలా గొప్ప  విషయం. అలా కొత్తగా ఆలోచించడంతో పాటు కమర్షియల్ గా హిట్ కూడా అందుకున్నాడు క్రిష్. అదే కృష్ణంవందే జగద్గురుం సినిమా. రానాకు సంబంధించి ప్రస్తుతం మనం గొప్పగా చెప్పుకుంటున్న భళ్లాలదేవ పాత్ర కంటే ముందే… అతడికి మంచిపేరు తీసుకొచ్చింది కృష్ణంవందే జగద్గురుం సినిమా.

krish-_-05

విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్న క్రిష్ బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. అయితే అక్కడ కూడా తన మార్గాన్ని వీడలేదు. అక్షయ్ కుమార్ హీరోగా గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమా చేశాడు. రమణ అనే తమిళ హిట్ సినిమాకు రీమేక్ ఇది.

krish-_-06

క్రిష్ టాలెంట్ ఏంటి..? అతను ఎంచుకున్న మార్గం సరైనదేనా…? అతడు ఎప్పుడు స్టార్ డైరక్టర్ అవుతాడు..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ చెక్ పెట్టిన సినిమా కంచె. ఈ సినిమాతో క్రిష్ టాలెంట్ పై అప్పటివరకు అనుమానాలు పెట్టుకున్న అతికొద్దికి కూడా ఆ డౌట్స్ తీరిపోయాయి.  ఈ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు క్రిష్.

krish-_-07

ప్రస్తుతం ఈ స్టార్ దర్శకుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ప్రయోగమే. శతాబ్దాల  కిందట అమరావతిని రాజధానిగా చేసుకొని దక్షిణాదిని ఏలిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పైగా నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా కూడా. సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా థియేటర్లలోకి రానుంది.