#Prabhas21 - మరో అప్డేట్ కోసం వెయిటింగ్

Saturday,October 10,2020 - 03:54 by Z_CLU

#Prabhas21 లో BigB Amitabh Bhachchan ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించి డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అయితే ఈ అప్ డేట్ ని ఎంజాయ్ చేస్తూనే మరో అప్ డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. అవును ఈ నెల 23 న Prabhas Birthday సందర్భంగా ఈ సినిమాను నుండి మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇస్తారా అని చూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో Nag Ashwin డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా టైటిల్ ను ప్రభాస్ పుట్టిన రోజున ప్రకటిస్తూ లోగో రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తుంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆ లోగో రిలీజ్ కి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అప్డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. Vyjayanthi Movies నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అనే ఆసక్తి అందరిలో ఉంది.