జ్యో కోసం మరోసారి

Monday,November 28,2016 - 12:24 by Z_CLU

అప్పుడు జ్యో కోసం కొట్టుకున్న ఈ ఆన్ స్క్రీన్ అన్నదమ్ములు, మరోసారి ‘కథలో రాకుమారి’ కోసం కలిసి తెరపైకి వస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమా కన్నా ఈ బ్రదర్స్ కాంబోకే ఎక్కువ క్రేజ్ సెట్ అయింది. నచురల్ గా రియల్ అన్నదమ్ముల్లా అలరించిన నాగశౌర్య, నారా రోహిత్ ‘కథలో రాకుమారి’ అనే సినిమాలో మరోసారి కలిసి నటిస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.

Naga Shourya, Regina Cassandra, Nara Rohit in Jyo Achyutananda Movie Stills

మహేష్ సూరపనేని డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో నారా రోహిత్ కి జంటగా నమితా ప్రమోద్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో నాగశౌర్య గెస్ట్ ఎప్పీయరెన్స్ లో అలరిస్తున్నాడు. ఏ టైం లో ఎంట్రీ ఇస్తాడు.. ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు లాంటివి ప్రస్తుతానికి బయట పెట్టకపోయినా, నాగశౌర్య ఎంట్రీ సినిమాకి కచ్చితంగా ప్లస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.