సాహో నుంచి మరో టీజర్

Monday,April 02,2018 - 07:25 by Z_CLU

బాహుబలి-2 విడుదలైనప్పుడే సాహో టీజర్ కూడా రిలీజ్ చేశారు. బాహుబలి-2 ఇంటర్వెల్ టైమ్ లో వచ్చిన ఆ టీజర్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కానీ ఇప్పుడది పాతది అయిపోయింది. అందుకే మరో టీజర్ విడుదల చేయాలనుకుంటోంది యూనిట్. మూవీకి మరింత హైప్ తీసుకొచ్చేందుకు సెకెండ్ టీజర్ సిద్ధం చేస్తోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 2 నెలల్లో సాహో సినిమాకు సంబంధించి సెకెండ్ టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్నే ఫస్ట్ లుక్ టీజర్ అని కూడా అనుకోవచ్చు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన అబుదాబి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే సాహో సెకెండ్ టీజర్ పై ఓ క్లారిటీ వస్తుంది.

సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తోంది సాహో సినిమా. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్.