'ఉన్నది ఒకటే జిందగీ'లో మరో లుక్ కూడా ఉంది - రామ్

Thursday,August 31,2017 - 12:01 by Z_CLU

రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేను శైలజ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిందించి. ఇక కొత్త సినిమా విషయానికొస్తే.. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’లో రాక్ స్టార్ గా కనిపిస్తున్నాడు రామ్. అతడి లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడు రామ్

ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో రాక్ స్టార్ అభిరామ్ లుక్ తో పాటు మరో నయా లుక్ కూడా ఉందని అంటున్నాడు. ఆ లుక్ ను ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచుతున్నామని, అది కూడా తనకు మంచి పేరు తీసుకొస్తుందని అంటున్నాడు రామ్. అది చాలా మెచ్యూర్డ్ లుక్ అని చెప్పుకొస్తున్నాడు.

ఉన్నది ఒకటే జిందగీ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా గిటార్ నేర్చుకున్నాడు రామ్.