హలో నుంచి మరో సర్ ప్రైజ్

Monday,November 13,2017 - 04:24 by Z_CLU

అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ డిజైన్ కూడా విడుదలైంది. సినిమా రిలీజ్ కు టైం దగ్గరపడ్డంతో ఇప్పుడు షూటింగ్ తో పాటు ప్రమోషన్ పై కూడా దృష్టిపెట్టింది యూనిట్. ఇందులో భాగంగా రేపు మరో చిన్నపాటి సర్ ప్రైజ్ ఉండబోతోందంటూ ట్వీట్ చేశాడు అఖిల్.

హలో సినిమాకు సంబంధించి రేపు ఓ సర్ ప్రైజ్ మెటీరియల్ రాబోతోందని ఎనౌన్స్ చేశాడు అఖిల్. అయితే అదేంటనేది మాత్రం చెప్పలేదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. హలో సినిమాలో హీరోయిన్ ను రేపు రివీల్ చేసే ఛాన్స్ ఉంది. మరికొందరు మాత్రం సాంగ్ బిట్ ను విడుదల చేస్తారని అంటున్నారు. వీటిలో ఏది నిజమో రేపు తేలిపోతుంది.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది హలో సినిమా. ఒకప్పటి హీరోయిన్ లిజి కూతురు కల్యాణి, ఈ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమాలో అఖిల్ ఓ పాట కూడా పాడాడు.