నయన్ నుంచి మరో పవర్ ఫుల్ చిత్రం

Friday,April 07,2017 - 11:26 by Z_CLU

ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయింది నయనతార. తెలుగులో ఆమె కాస్త గ్లామర్ పాత్రలు చేస్తున్నప్పటికీ.. తమిళ్ లో మాత్రం పూర్తిగా కథాబలం ఉన్న చిత్రాలకే పరిమితమైపోయింది. ఇప్పటికో డోర సినిమాతో తమిళనాట సూపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసింది. ఆ సినిమా పేరు అరమ్.

కెరీర్ లో ఫస్ట్ టైం అరమ్ సినిమాలో జిల్లా కలెక్టర్ గా నటించింది నయనతార. ఆ పాాత్ర కోసం ఆమె చాలా హోం వర్క్ చేసింది. దాదాపు 8 నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ మోడ్ లోకి ఎంటరైంది. రీసెంట్ గా అరమ్ సినిమా ట్రయిలర్ కూడా లాంచ్ చేశారు. ఓ బలమైన సాామాజిక అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ లుక్స్ అందర్నీ విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

గోపి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించాడు. విఘ్నేష్, రమేష్ సపోర్టింగ్ రోల్స్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.