మోహన్ లాల్ నుంచి మరో సినిమా `బ్లాక్‌మ‌నీ`

Monday,March 20,2017 - 03:32 by Z_CLU

 

జ‌న‌తా గ్యారేజ్‌, మ‌న‌మంతా, మ‌న్యం పులి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు మోహ‌న్‌లాల్‌. ఇదే స్పీడ్‌లో అటు మ‌ల‌యాళంలో, ఇటు తెలుగులో వ‌రుస‌గా క్రేజీ అవ‌కాశాలు దక్కించుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క‌మైన రోల్స్ ప్లే చేస్తూ త‌న హ‌వా చాటుతున్నారు. తాజాగా మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్‌హిట్ `రన్ బేబి ర‌న్‌` తెలుగులోకి  `బ్లాక్‌మ‌నీ`. `.. అన్నీ కొత్త నోట్లే` అన్న పేరుతో అనువాద‌మై రిలీజ‌వుతోంది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ బృందం `క్లీన్ యు` స‌ర్టిఫికెట్ ఇచ్చింది.

మీడియా నేప‌థ్యంలో సాగుతుంది బ్లాక్ మనీ సినిమా. లాల్ ఓ టీవీచానెల్ కెమెరామేన్‌గా న‌టించారు. క‌థానాయిక అమ‌లాపాల్ సీనియ‌ర్ ఎడిట‌ర్ రేణుక పాత్ర‌లో న‌టించారు. సంబంధ బాంధ‌వ్యాలు, వృత్తిప‌ర‌మైన సంఘ‌ర్ష‌ణ చుట్టూ క‌థాంశం తిరుగుతుంది. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన చిత్ర‌మిది.

సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రానికి జోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వెన్నెల‌కంటి సంభాష‌ణ‌లు అందించారు.