సుక్కు-దేవి... మరో ఐటెం సాంగ్!

Thursday,March 26,2020 - 10:42 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ వచ్చే సాంగ్స్ కోసం మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అందులో సుకుమార్ -దేవి శ్రీ ప్రసాద్ ముందు వరుసలో ఉంటారు. అవును.. దేవి లేకుండా సుక్కు ఒక్క సినిమా కూడా చేయలేదు. ‘ఆర్య’ నుండి ‘రంగస్థలం’ వరకు సుకుమార్ తీసిన అన్ని సినిమాలకు దేవినే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్టే.

అందుకే ఇప్పుడు బన్నీ సినిమా కోసం వీరిద్దరు కలిసి ఏ రేంజ్ సాంగ్స్ అందిస్తారోనన్న అంచనాలు ఉన్నాయి. ఇక సుక్కు – దేవి కాంబో ఆల్బం అంటే అందులో ఐటెం సాంగ్ కచ్చితంగా ఉంటుంది. ‘అ అంటే అమలాపురం’ నుండి ‘జిగేల్ రాణి’ వరకూ వీరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ ఐటెం సాంగ్ శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు అలాంటి మరో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి బన్నీ సినిమా కోసం రెడీ అవుతుందట. లేటెస్ట్ గా ఐటెం సాంగ్ కి సంబంధించి దేవి ఓ ట్యూన్ కూడా కంపోజ్ చేసాడని సమాచారం. ఇక బన్నీ -సుక్కు -దేవి ఈ ముగ్గురి కాంబినేషన్ లో రాబోయే ఆ ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో చూడాలి.