రంగస్థలం నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్

Monday,March 12,2018 - 11:57 by Z_CLU

రంగస్థలం సినిమా నుంచి ఇప్పటివరకు రామ్ చరణ్, సమంత స్టిల్స్ మాత్రమే చూశాం. అవి కూడా మాంటేజ్ షాట్స్ మాత్రమే. సినిమా స్టోరీని రివీల్ చేసేలా ఒక్క స్టిల్ కూడా బయటకు రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతూ మరో స్టిల్ రిలీజ్ అయింది. ఇది అలాంటిలాంటి స్టిల్ కాదు.

చూస్తున్నారుగా… రంగస్థలం సినిమా నుంచి ఆది పినిశెట్టి స్టిల్ ఇది. ఈ ఒక్క ఫొటోతో చాలా విషయాల్ని చెప్పేసింది యూనిట్. మరీ ముఖ్యంగా రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. వీటిలో ఒకటి రంగస్థలం అనేది ఓ గ్రామం అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో కాస్త పొలిటికల్ టచ్ ఉంటుందనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. ఆ విషయంపై కూడా తాజా పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది.

కుమార్ బాబు పాత్రలో, లాంతరు గుర్తుపై ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్న ఆది స్టిల్.. రంగస్థలంపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. తాజా స్టిల్ తో ఈ సినిమాకు సంబంధించిన 3 కీలకమైన క్యారెక్టర్లను పరిచయం చేసినట్టయింది. రామలక్ష్మిగా సమంత, చిట్టిబాబుగా చరణ్, కుమార్ బాబుగా ఆది ఈ సినిమాలో కనిపించబోతున్నారు.