2.0 నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్

Wednesday,October 25,2017 - 12:25 by Z_CLU

ఆడియో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ 2.0 సినిమాపై రోజురోజుకు క్యూరియాసిటీ పెరుగుతోంది. ఆ అంచనాల్ని మరింత పెంచేలా మరో పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఓవైపు హీరోయిన్ ఎమీజాక్సన్, మరోవైపు రోబో ఫొటోల్ని పెడుతూ యూనిట్ విడుదల చేసిన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిజానికి ఆడియో రిలీజ్ కు సంబంధించి ఇప్పటికే ఓ స్టిల్ విడుదల చేసింది యూనిట్. పియానోపై ఓవైపు రోబో చేయి, మరోవైపు ఏలియన్ చేయి పెట్టి ఇంట్రెస్టింగ్ పోస్టర్ తయారుచేసి విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తాజా పోస్టర్ విడుదలైంది. ఈనెల 27న దుబాయ్ లో 2.0 ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది.

ఈ వేడుకకు కమల్ హాసన్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారు. వేదికపై 120 మంది సింఫనీ ఆర్కెస్ట్రాతో లైవ్ షో ఇవ్వబోతున్నాడు సంగీత దర్శకుడు రెహ్మాన్. ఈ వేడుక కోసం 12వేల పాసులు జారీచేశారు.