సిల్లీ ఫెలోస్ నుంచి ఫన్నీ సాంగ్

Monday,September 03,2018 - 11:25 by Z_CLU

బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్-3 గా వస్తున్న చిత్రం “సిల్లీ ఫెల్లోస్”. అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మరో సింగిల్ రిలీజ్ చేశారు.

పిల్లా నీ బుగ్గలు రెండు అనే లిరిక్స్ తో సాగే ఈ పాట ఫన్నీగా ఉంది. అమ్మాయి అందాల్ని, వంటకాలతో పోలుస్తూ గణేష్ ఈ లిరిక్స్ రాయగా.. రాహుల్ సింప్లిగంజ్ ఆలపించాడు. శ్రీవసంత్ ఈ పాటకు హుషారైన బాణీలు సమకూర్చాడు.

అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా, పూర్ణ, నందిని రాయ్, బ్రహ్మానందం, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి.. కెమెరా: అనిష్ తరుణ్ కుమార్
ఆర్ట్: ఎమ్.కిరణ్ కుమార్
మ్యూజిక్: శ్రీ వసంత్
ఎడిటర్: గౌతమ్ రాజు
యాక్షన్: డ్రాగన్ ప్రకాష్
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, భాను
లిరిక్స్: కాశర్ల శ్యామ్, చిలకరెక్క గణేష్
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
సహ నిర్మాత: వివేక్ కుచిబొట్ల
దర్శకుడు: భీమినేని శ్రీనివాస్