మరో సినిమా ప్రకటించే ఛాన్స్

Friday,November 11,2016 - 10:38 by Z_CLU

కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే, త్రివిక్రమ్ తో సినిమాని ప్రకటించేశాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి కూడా రాలేదు నేసన్ డైరెక్షన్ లో ఇంకో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు పవర్ స్టార్. ముందే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ లో చిన్నపాటి తేడా కూడా రాకుండా, కనీసం బ్రేక్ కూడా తీసుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అనుకున్న టైం కి షూటింగ్ కానిస్తే మంచిదేగా అనుకునే లోపు.. ఇంకో షాకింగ్ న్యూస్ ఇచ్చాడు పవర్ .

అనంతపురం నుండే తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడతానని ప్రకటించేశాడు పవన్ కళ్యాణ్. అంటే 2019 కల్లా పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొననున్న పవర్ స్టార్ ఈ లోపు అనుకున్న సినిమాలన్నీ పూర్తి చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే ఈ బ్యాక్ టు బ్యాక్ బిజీ షెడ్యూల్స్.

ఇప్పటికే మూడు సినిమాలను ఆల్ రెడీ ప్రకటించేసిన పవన్ కళ్యాణ్ రేపో మాపో ఇంకో సినిమాను ప్రకటించే చాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ సినిమా దర్శక, నిర్మాతల డీటేల్స్ ప్రస్తుతానికి సస్పెన్స్ జోన్ లో ఉన్నా, రేపో మాపో టైం చూసుకుని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టుంది సినిమా యూనిట్. మొత్తానికి ఈ రెండేళ్లలో కమిట్ అయిన సినిమాలకు శుభం కార్డు వేసేసి, ఫుల్ టైం పాలిటిక్స్ పై కాన్సంట్రేట్ చేద్దామనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఆ తరవాతే రీ ఎంట్రీ గురించి ఆలోచిస్తాడు.