మరో ఫారిన్ టూర్ ఫిక్స్ చేసిన ప్రిన్స్

Thursday,December 01,2016 - 09:30 by Z_CLU

తన సినిమా షూటింగ్స్ కంటే ఫ్యామిలీతో గడిపేందుకే ఎక్కువగా విదేశాలకు వెళ్తుంటాడు మహేష్ బాబు. కొడుకు గౌతమ్, కూతురు సితారకు ఇప్పటికేే కొన్ని దేశాల్ని పరిచయం చేసిన ప్రిన్స్… త్వరలోనే మరో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ నెలలో క్రిస్మస్ ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ పండగను ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ తెలుసు. ఆ ఫెస్టివల్ ను గౌతమ్-సితారకు ప్రత్యక్షంగా చూపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు మహేష్ బాబు. కుటుంబంతో కలిసి ఈనెలాఖరుకు లండన్ టూర్ ప్లాన్ చేశాడు.

mahesh-family-3

మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఇది భారీ షెడ్యూల్. దాదాపు మరో 2 వారాల వరకు ఇది ఉంటుంది. ఈ బడా షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే… హైదరాబాద్ తిరిగొచ్చి భార్యపిల్లలతో కలిసి లండన్ వెళ్లబోతున్నాడు మహేష్. క్రిస్మస్ ను అక్కడే సెలబ్రేట్ చేసుకొని తర్వాత ఇండియాకు వస్తారు.