తెలుగుతెరపై మరో డిఫరెంట్ చిత్రం "రాహు"

Saturday,August 10,2019 - 02:29 by Z_CLU

కొత్త సబ్జెక్ట్స్ తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమాలో రివల్యూషన్ తీసుకొస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారెవరురా లాంటి చిన్న చిత్రాలు ఎలాంటి విజయాలు సాధించాయో అందరం చూశాం. ఇలాంటి న్యూ ఏజ్ సినిమానే రాహు. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇప్పటివరకు తెలుగుతెరపై రాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు సుబ్బు. అమెరికాలో చదువుకున్న ఈ డైరక్టర్, దాదాపు రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశాడు. కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను స్వామి, బాబ్ది, రాజా నిర్మిస్తున్నారు.

డైరక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ – సురేష్ రగుతు, ఈశ్వర్
మ్యూజిక్ – లక్కరాజు
ఎడిటింగ్ – అమర్ రెడ్డి
రచన, దర్శకత్వం – సుబ్బు వేదుల
నిర్మాతలు – ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల