సిల్వర్ స్క్రీన్ పైకి మరో బయోపిక్

Wednesday,May 27,2020 - 01:49 by Z_CLU

మొన్నటివరకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బయోపిక్ ల ట్రెండ్ నడిచింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ పరాజయంతో టాలీవుడ్ లో ప్లాన్ చెసుకున్న బయోపిక్ లను లైట్ తీసుకున్నారు చాలామంది. అయితే తాజాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ బయోపిక్ కి శ్రీకారం చుట్టాడు రైటర్ ప్రసన్న కుమార్.

ఒకప్పటి వాలీ బాల్ ప్లేయర్ అరికెపూడి రమణరావు కథతో సినిమా స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడు. 1978లో అర్జున అవార్డు , 1991 లో ద్రోణాచార్య అవార్డు అందుకున్న రమణారావు జీవితంలో ఎన్నో గొప్ప సంఘటనలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని సినిమా లిబర్టీస్ తీసుకుంటూ కథను రెడీ చేస్తున్నాడు ప్రసన్న.

ప్రస్తుతం ఈ కథకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు ఈ యంగ్ రైటర్. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే హీరో, దర్శకుడి పేరుతో అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ బయోపిక్ లో నటించబోయే హీరో ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ అంటే ఓ మోస్తరు పెద్ద హీరోనే ఉంటాడు మరి.