దేవిశ్రీ చేతికి మరో భారీ ప్రాజెక్టు

Wednesday,May 17,2017 - 10:27 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు. అది కూడా కోలీవుడ్ లో కావడం విశేషం. ఇప్పటికే తమిళనాట పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన డీఎస్పీ.. త్వరలోనే విక్రమ్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు.

సింగం ఫ్రాంచైజీ దర్శకుడు హరి, విక్రమ్ కలిసి ఓ ప్రాజెక్టు చేయబోతున్నారు. అది కూడా సీక్వెల్. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్ గా సామి-2 చిత్రాన్ని తీయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు దేవిశ్రీని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు.

యముడు, సింగం-2 సినిమాలతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా వర్క్ చేశాడు. అటు విక్రమ్ నటించిన మల్లన్న సినిమాకు కూడా దేవిశ్రీనే మ్యూజిక్ డైరక్టర్. హీరో-డైరక్టర్ ఇద్దరికీ సింక్ అయ్యాడు కాబట్టే ఛాన్స్ ఈజీగా వచ్చింది. త్వరలోనే సామి-2 మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం అవుతాయి.