మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన రకుల్

Thursday,July 20,2017 - 11:30 by Z_CLU

మహేష్ సరసన ఛాన్స్ దక్కినప్పుడే ఆమెను వెరీ లక్కీ అన్నారంతా. సేమ్ టు సేమ్ అలాంటిందే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది రకుల్ ప్రీత్. త్వరలోనే విజయ్ సరసన నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ. అది కూడా మురుగదాస్ దర్శకత్వంలో కావడం విశేషం.

స్పైడర్ సినిమాలో రకుల్ వర్క్, డెడికేషన్ బాగా నచ్చిందట మురుగదాస్ కు. అందుకే విజయ్ తో చేయబోయే సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడట. ఈ వార్తతో ప్రస్తుతం పండగ చేసుకుంటోంది రకుల్. కోలీవుడ్ లో విజయ్-మురుగదాస్ ది క్రేజ్ కాంబో. గతంలో తుపాకి, కత్తి లాంటి రెండు సూపర్ హిట్స్ వచ్చాయి వీళ్లిద్దరి కాంబినేషన్ లో. త్వరలోనే రాబోతున్న హ్యాట్రిక్ మూవీలో రకుల్ కు హీరోయిన్ ఆఫర్ దక్కింది.

ప్రస్తుతం స్పైడర్ తో పాటు కార్తి సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తోంది రకుల్. తెలుగులో ఇప్పటికే స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తమిళనాట కూడా క్రేజీ బ్యూటీగా మారిపోతోందన్నమాట.