ఎన్టీఆర్ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసిన చరణ్

Sunday,May 06,2018 - 02:21 by Z_CLU

ఎన్టీఆర్-చరణ్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా విషయాలతో పాటు చాలా డిస్కస్ చేసుకుంటారు ఈ ఇద్దరు మిత్రులు. వీళ్లిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏ రేంజ్ లో ఉందో తాజాగా మరోసారి అందరికీ తెలిసొచ్చింది. స్వయంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ పెళ్లిరోజును సెలబ్రేట్ చేశాడు.

ఎన్టీఆర్-ప్రణతి వివాహం జరిగి నిన్నటికి ఏడేళ్లవుతోంది. ఈ సందర్భంగా రాత్రి ప్రత్యేకంగా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు ఎన్టీఆర్-చరణ్. ఏకంగా కుటుంబసమేతంగా ఈ వేడుకకు చరణ్ హాజరయ్యాడు. ఉపాసన ఒడిలో ఎన్టీఆర్ కొడుకు కూర్చోగా.. చరణ్-తారక్ ఒకరి భుజాలపై ఒకరు చేయివేసుకొని ఓ ఫొటో దిగారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేయబోతున్నారు. చరణ్-తారక్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మాతగా ఓ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించి కాలిఫోర్నియాలో హీరోలతో ఫొటో సెషన్ కూడా పూర్తయింది. జులై లేదా ఆగస్ట్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే చాన్స్ ఉంది.