డిసెంబర్ ను వదలనంటున్న నాగ్...

Tuesday,October 03,2017 - 04:06 by Z_CLU

విక్రమ్ దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న ‘హలో’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు నాగ్..అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా బాలన్స్ ఉందని, డిసెంబర్ లో ఈ సినిమా రాకపోవచ్చని టాక్ చక్కర్లు కొడుతుంది..


ఈ విషయం పై స్పందించాడు నాగ్..’హలో’ సినిమా బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ముందుగా అక్టోబర్ 15 కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాం. కానీ వర్షాల వల్ల ఒక వారం లేట్ కానుంది. అక్టోబర్ నెలాఖరు వరకూ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఒక పక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. డిసెంబర్ 22 న రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటికే థియేటర్స్ మాట్లాడి పెట్టేశాం.. ఆ డేట్ దాటితే ఇక ఇప్పట్లో మరో డేట్ దొరకడం కష్టమే.. వరుసగా పెద్ద సినిమాలు ఉన్నాయి. అందుకే డిసెంబర్ వదిలే ప్రసక్తే లేదు. ” అంటూ చెప్పుకొచ్చాడు కింగ్. సో అఖిల్ హలో అంటూ డిసెంబర్ లో గట్టి సందడే చేస్తాడన్నమాట.