బీటెక్ బాబు మళ్లీ వస్తున్నాడు...

Wednesday,November 09,2016 - 01:10 by Z_CLU

సౌత్ లో ఇద్దరు బీటెక్ బాబులున్నారు. కృష్ణంవందే జగద్గురుం సినిమాలో రానా బీటెక్ బాబుగా కనిపిస్తాడు. ఇక తమిళ్ హీరో ధనుష్ కూడా రఘువరన్ బీటెక్ సినిమాతో బీటెక్ బాబు అనిపించుకున్నాడు. ఇప్పుడు వీళ్లలో ధనుష్.. మరోసారి బీటెక్ బాబుగా కనిపించబోతున్నాడు.

2

అవును.. రఘువరన్ బీటెక్ సినిమాకు పార్ట్-2 రాబోతోంది. రెండేళ్ల కిందట తమిళ్ లో వీఐపీ పేరుతో వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా బాగా హిట్ అయింది. పైగా సీక్వెల్ చేసేంత స్టఫ్ ఇందులో దండిగా ఉంది. అందుకే రఘువరన్ బీటెక్-2కు రంగం రెడీ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య ఈ సీక్వెల్ కు దర్శకురాలు. గతంలో ఈమె సూపర్ స్టార్ తో కొచ్చడయాన్ సినిమా తెరకెక్కించారు. డిసెంబర్ నుంచి వీఐపీ-2 అలియాస్ రఘువరన్-2 షూటింగ్ స్టార్టవుతుంది.