ఓం నమో వేంకటేశాయ టీజర్ రివ్యూ

Saturday,December 24,2016 - 11:31 by Z_CLU

నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓంనమో వేంకటేశాయ శరవేగంగా సిద్ధమౌతోంది. సినిమా సెట్స్ పైకి వచ్చిన మొదటి రోజు నుంచే ఫస్ట్ లుక్స్ తో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పటివరకు నాగ్-దర్శకేంద్రుడి కాంబినేషన్ లో వచ్చిన డివోషనల్ మూవీస్ అన్నీ హిట్ అయ్యాయి. మరీ ఓం నమో వేంకటేశాయ టీజర్ ఎలా ఉంది. జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ…
om-namo-venkatesaya
నాగ్ మరోసారి భక్తుడిగా నూటికి నూరుశాతం ఫిట్ అయిపోయాడు. గెటప్ నుంచి డైలాగ్ డెలవరీ వరకు ఎంతో మార్పు చూపించాడు. మొన్నటికి మొన్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో కనిపించిన మన్మధుడేనా ఈ నాగార్జున అనిపించేలా ఓంనమో వేంకటేశాయ టీజర్ తో మైమరిపించాడు. ఇక నాగార్జున తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు కీరవాణి గురించే. సినిమా టీజర్ స్టార్ట్ అవ్వడమే ఓ సుమధురమైన గీతంతో ప్రారంభమైంది. భక్తిరస చిత్రాలకు తానుతప్ప మరో ఆల్టర్నేటివ్ లేదని నిరూపించుకున్న కీరవాణి.. ఓంనమోవేంకటేశాయతో ఆ ఇమేజ్ ను మరింత పెంచుకున్నాడు.
anushka-om-namo-venkatesaya-looks
ఇక పాత్రల విషయానికొస్తే.. నాగార్జునతో పాటు అనుష్క, సౌరభ్, ప్రగ్యా జైశ్వాల్ పాత్రల ఫస్ట్ లుక్స్ ఇప్పటికే చూసేశాం కాబట్టి, వాళ్ల గెటప్స్ ఏమంత సర్ ప్రైజింగ్ అనిపించలేదు. అయితే రావు రమేష్, జగపతి బాబు పాత్రలు మాత్రం టీజర్ లో కొత్తగా కనిపించాయి. ఓవరాల్ గా ఓం నమో వేంకటేశాయ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 10న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.