శరవేగంగా 'ఓం నమో వెంకటేశాయ' చిత్రీకరణ

Tuesday,August 16,2016 - 11:40 by Z_CLU

 
అక్కినేని నాగార్జున, రాఘ వేంద్ర రావు కాంబినేషన్ లో తాజా గా రూపొందుతున్న భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇటీవలే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగుళూరు లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు యూనిట్. ఇక గతం లో నాగ్, దర్శకేంద్రుడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అన్నమయ్య’,’శ్రీరామ దాసు’,’షిరిడి సాయి’ వంటి భక్తి రస చిత్రాలు ఘన విజయం సాధించడం తో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అనుష్క గెస్ట్ పాత్ర లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తుంది.