నాగార్జున సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..?

Friday,December 02,2016 - 02:19 by Z_CLU

రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్టింగ్ డే నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ.. హాట్ టాపిక్ గా మార్చేశారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన నాగ్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేకపోయాడు. హెవీ గ్రాఫిక్ వర్క్ చేయాల్సి ఉంది కాబట్టి, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎగ్జాట్ గా చెప్పలేం అన్నాడు. అయితే తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే… ఈ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేయాలని అనుకుంటున్నారట. గ్రాఫిక్ టీంతో తుది సంప్రదింపులు జరిగిన తర్వాత ఈ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ తేదీని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు.

om-namo-venkatesaya-movie-working-stills

కుదిరితే ఈనెలాఖరుకు.. లేకపోతే వచ్చేనెలలో ఈ సినిమా ఆడియో విడుదల తేదీ, మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. హథీరామ్ బాబాగా నాగ్ నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.