ప్రమోషన్ మొదలెట్టిన నాగ్

Thursday,January 19,2017 - 03:46 by Z_CLU

త్వరలో రాఘవేంద్ర రావు దర్శకత్వం లో ‘ఓం నమో వెంకటేశాయ’ డివోషనల్ మూవీ తో ఫిబ్రవరి 10 నుంచి  థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్న నాగార్జున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను షురూ చేసేసాడు. రిలీజ్ కి ఇంకా 20 రోజుల టైం మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే ఈ సినిమా పై హైప్ క్రియేట్ చేయడానికి బరిలోకి దిగాడు నాగ్.

గతం లో రాఘవేంద్ర రావు-నాగ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అన్నమయ్య’ సెన్సేషనల్ హిట్ సాధించి టాలీవుడ్ నిలిచి ఎవర్ గ్రీన్ సినిమా గా నిలిచిపోవడం తో మరోసారి ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాను కూడా అదే స్థానం లో నిలిపేందుకు ట్రే చేస్తున్నాడు నాగ్.

ఇటీవలే సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక ను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా టీం అందరు కలిసి టి.వి.చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ఈ ప్రమోషన్స్ లో ఇప్పటికే నాగార్జున తో పాటు సౌరబ్, అనుష్క,ప్రగ్య జైస్వాల్ దర్శకులు రాఘవేంద్ర రావు పాల్గొంటున్నారు….