నా కెరీర్లో ది బెస్ట్ ఫిలిం....

Wednesday,February 08,2017 - 08:36 by Z_CLU

కింగ్ నాగార్జున-రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వస్తున్న మరో భక్తి రస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న విడుదలకి రెడీ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారు. ఈ ప్రోగ్రాం లో నాగార్జున మాట్లాడుతూ “ఈ సినిమా విషయంలో ఒకే ఒక్క ముక్క చెప్పాలనుకుంటున్నా. ఈ సినిమా నా కెరీర్ లో ది బెస్ట్ ఫిలిం. కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా చెయ్యొచ్చు ఇప్పటికే 95 చేసాను. కానీ ఇలాంటి గొప్ప సినిమా చేసే అవకాశం మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సాదరంగా తిరుమల వెళ్తూ వస్తుంటాం కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు తిరుమలకి సంబంధించి ఇప్పటి వరకూ తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అప్పట్లో ‘అన్నమయ్య’ చేసాక కూడా ఇలా చాలా విషయాలు తెలుసుకున్నా. ఇక రిలీజ్ కి ముందు కాస్త టెన్షన్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయం లో నాకు ఎలాంటి టెన్షన్ , భయం లేదు సినిమా చూసాను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ టైంలో ఇలాంటి గొప్ప సినిమా చేయడం నా అదృష్టం గా భావిస్తున్నా. టీం అందరు నా సన్నిహితులే వారికి స్పెషల్ గా థాంక్స్ చెప్పుకోలేను. ” అని అన్నారు.

om-namo-venkatesaya-press-meet

“ఫిబ్రవరి 10 నుంచి అన్ని థియేటర్లు తిరుమల పుణ్య క్షేత్రంగా మారబోతున్నాయి. ఆ నమ్మకం మా అందరికి ఉందని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు.  ఈ  కార్యక్రమం లో సౌరబ్, విమల రామన్ తో పాటు టీం పాల్గొని సినిమాలో భాగం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు…