వెయిటింగ్ లిస్టులో ఓం నమో వెంకటేశాయ

Monday,January 30,2017 - 06:00 by Z_CLU

ఓం నమో వెంకటేశాయ కౌంట్ డౌన్ స్టార్టయింది. ఫిబ్రవరి 10 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా, కంప్లీట్ గా ప్యాకప్ అయిపోయింది. నిన్నటి వరకు చిన్న చిన్న ఎడిటింగ్ కరెక్షన్స్ చూసుకున్న సినిమా యూనిట్, రన్ టైం ని కూడా లాక్ చేసేసింది.

రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం ఎగ్జాక్ట్ గా 2 గంటల 13 నిమిషాలు. ప్రస్తుతం సెన్సార్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమా యూనిట్, ఫైనల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది.

అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున హాతిరాం బాబా గా కనిపించనున్నాడు. డివోషనల్ ఎలిమెంట్స్ పక్కన పెడితే, కలర్ ఫుల్ సెట్టింగ్స్ లో విజువల్ ట్రీట్ లా తెరకెక్కిన ఈ సినిమా కోసం యూత్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.