ఓం నమో వెంకటేశాయ ఆడియో రిలీజ్

Monday,December 26,2016 - 01:15 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ఓం నమో వెంకటేశాయ టీజర్ కి వచ్చిన్ రెస్పాన్స్ తో సినిమా యూనిట్ చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. జస్ట్ 24 గంటల్లోనే 2 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమా యూనిట్, జనవరి 8 న ఆడియో రిలీజ్ జరుపుకోనుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వీడియో ట్వీట్ చేశాడు.

క్రిస్ మస్ రోజు ఫ్యాన్స్ అందరికీ క్రిస్ మస్ విషెస్ చెప్పిన నాగ్, ఈ సినిమా ఆడియో కూడా అంతే స్పెషల్ గా ఉండబోతుదని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, అనుష్క, ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తున్నారు.