RRR.. సెకెండ్ హీరోయిన్ ఫిక్స్

Wednesday,November 20,2019 - 04:31 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR సినిమా నుంచి ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్థానాన్ని ఇప్పటివరకు భర్తీ చేయలేదు. మళ్లీ ఇన్ని రోజులకు RRR ప్రాజెక్టులో సెకెండ్ హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఒలీవియా మోరిస్ ను RRRలో సెకెండ్ హీరోయిన్ గా నటించనుంది.

సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించనుంది. RRRలో ఆమె క్యారెక్టర్ పేరు జెన్నిఫర్. త్వరలోనే ఆమె సెట్స్ లోకి రాబోతోంది. సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది RRR మూవీ. సినిమాకు సంబంధించి ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయినట్టు యూనిట్ కన్ ఫర్మ్ చేసింది. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. జనవరి నుంచి సినిమా అఫీషియల్ ప్రమోషన్ ప్రారంభమౌతుంది.