పాత కాలం.. కొత్త కథ.. నయా ట్రెండ్

Tuesday,August 28,2018 - 12:38 by Z_CLU

తెలుగు సినిమా కథలు గతంలోకి తొంగిచూస్తున్నాయి. అలనాటి యాంబియన్స్ ను ఇప్పటితరానికి పరిచయం చేస్తున్నాయి. 1980ల నాటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, మరిన్ని సినిమాలు ఇప్పుడు 30-40 ఏళ్ల వెనక్కి వెళ్తున్నాయి.

రంగస్థలం -1980
అప్పటి జెనరేషన్ తో పాటు ఇప్పటి తరం ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసి మెస్మరైజ్ చేసిన సినిమా ‘రంగస్థలం’. 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం 1980ల కాలాన్ని తలపించే పల్లెటూరి సెట్ వేశారు. ఓ రెగ్యులర్ రివెంజ్ డ్రామా అయినప్పటికీ, ఈ 80ల నాటి బ్యాక్ డ్రాప్ మూవీకి కొత్తదనం తీసుకొచ్చింది.


సైరా నరసింహ రెడ్డి – 1800
మెగా స్టార్ డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహ రెడ్డి’ 1800 లో జరిగిన సంఘటనలతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే… స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను 1800 లోకి తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేయనుంది. అప్పటి వాతావరణం, దుస్తులు, ఇళ్లు, గుర్రాలు.. ఇలా అన్నీ ఎట్రాక్ట్ చేయబోతున్నాయి. 1800 సంవత్సరం నాటి కాలాన్ని ప్రతిబింబించేలా ఏకంగా 14 సెట్స్ వేశారు.


కల్కి
పాత కాలాన్ని గుర్తుచేసే మరో సినిమా కల్కి. రాజశేఖర్ -ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కూడా 1980ల నాటి పల్లె వాతావరణాన్ని చూపించనుంది. రంగస్థలంలో ఓ ఆంధ్రా పల్లెటూరును చూపిస్తే, కల్కిలో అచ్చమైన తెలంగాణ పల్లెను చూపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

శర్వానంద్-సుదీర్ వర్మ సినిమా
శర్వానంద్ -సుదీర్ వర్మ సినిమా 1990ల కాలాన్ని రిప్రజెంట్ చేయబోతోంది. అంటే దాదాపు 30 ఏళ్ల కిందటి వాతావరణాన్ని చూపించబోతున్నారన్నమాట. దీనికి సంబంధించి ఇప్పటికే కాకినాడలో షూటింగ్ చేశారు. మరో భారీ సెట్ కూడా వేశారు. పాతికేళ్ల కిందటి రౌడీ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నాడు

 

విరాటపర్వం 1992
ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు కానీ వేణు ఉడుగుల డైరెక్షన్ లో రూపొందనున్న ఈ సినిమా కూడా ప్రేక్షకులను మళ్ళీ వెనక్కి తీసుకెళ్లబోతోంది. ఇప్పటికైతే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం ఉంది. మరి ఈ పీరియాడిక్ సినిమాలో కనిపించే హీరో ఎవరో తెలియాల్సి ఉంది. ఈ సినిమాను తమిళ్ తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారు మేకర్స్

ఇలా చాలా తెలుగు సినిమాలు పాతకాలాన్ని చూపించే కథాంశాలతో వస్తున్నాయి. నాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకురాబోతున్న జెర్సీ సినిమాలో కూడా 90ల నాటి క్రికెట్ కాలాన్ని చూపించబోతున్నారట.