అంచనాలు పెంచిన మంచు మనోజ్ సినిమా

Thursday,June 15,2017 - 12:38 by Z_CLU

మంచు మనోజ్ లేటెస్ట్ మూవీ ఒక్కడు మిగిలాడు. అజయ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. 54 సెకెన్ల టీజర్ తో సినిమాపై అంచనాల్ని ఇంకాస్త పెంచగలిగాడు మంచు మనోజ్.

మంచు మనోజ్ వాయిస్ ఓవర్ తో వచ్చే ఈ టీజర్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. రెండు డిఫరెంట్ షేడ్స్ తో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు మంచు మనోజ్. యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాడిగా ఓ వైపు, తమిళుల కోసం పోరాడే ఎల్టీటీసీ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్రలో మరో వైపు కనిపిస్తున్నాడు. ఈ రెండు ఛాలెంజింగ్ పాత్రల్ని మంచు మనోజ్ అద్భుతంగా పోషించాడట.

టీజర్ చూస్తే సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమౌతోంది. ఇక కథ కూడా సరికొత్తగా ఉండబోతోందనే విషయం తెలుస్తూనే ఉంది. మంచు మనోజ్ ఎంచుకునే కథలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఒక్కడు మిగిలాడు సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ శివ నందిగాం బ్యాక్ గ్రౌడ్ స్కోర్ టీజర్ ను మరింత ఎలివేట్ చేసింది. తన గెటప్, టీజర్ తో అంచనాలు పెంచిన మంచు మనోజ్.. ఒక్కడు మిగిలాడంటూ త్వరలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.