ఆగస్ట్‌ 29న 'ఒక్కడొచ్చాడు' టీజర్‌ విడుదల

Saturday,August 27,2016 - 10:00 by Z_CLU

 
విశాల్‌-తమన్నా జంటగా సురాజ్‌ దర్శకత్వం లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రానికి హిప్‌ ఆప్‌ తమిళ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ భారీ ఛేజ్‌ని షూట్‌ చేశారు యూనిట్. ఈ ఛేజ్‌ చిత్రానికే ఓ హైలెట్‌ కానుందని చెబుతున్నాయి చిత్ర వర్గాలు. ప్రస్తుతం రష్యాలో పాటలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఆగస్ట్‌ 29 విశాల్‌ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ ను , అక్టోబర్‌ 9న ఆడియో ను విడుదల చేసి, దీపావళి సందర్భంగా సినిమా ను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.