క్యూరాసిటీ రేజ్ చేస్తున్న ‘ఒక్కక్షణం’ టీజర్

Sunday,December 03,2017 - 11:26 by Z_CLU

అల్లు శిరీష్ ‘ఒక్కక్షణం’ టీజర్ రిలీజయింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’  లాంటి సూపర్ హిట్ ఎంటర్ టైనర్ తరవాత V.I. ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ మూవీపై మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్రాబ్ చేస్తే, ఈ రోజు రిలీజైన ఈ టీజర్ మూవీ లవర్స్ లో క్యూరాసిటీ రేజ్ చేయడంలో సక్సెస్ అయింది.

ఒక మనిషిని పోలిన మరో మనిషి ఉండటం లాంటి కాన్సెప్ట్స్ చాలా రొటీన్. కానీ ‘మన లైఫ్ లాగే మరొకరి లైఫ్ కూడా ఉంటే..? ప్రస్తుతం వాళ్ళు బ్రతుకుతున్న లైఫ్ లాగే మన ఫ్యూచర్ ఉంటుందని తెలిస్తే..?’ ఇలాంటి  ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిందే ‘ఒక్కక్షణం’ మూవీ. టీజర్ లోనే సినిమా థీమ్ ని ఎలివేట్ చేసింది మూవీ టీమ్. అయితే తను ప్రేమించిన అమ్మాయి కోసం డెస్టినీకి వర్సెస్ గా ఓ కుర్రాడు ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానుంది.

 

చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన సురభి నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా డిసెంబర్ 23 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.