ఇంప్రెస్ చేస్తున్న ఒక్కడు మిగిలాడు

Saturday,May 20,2017 - 09:03 by Z_CLU

వ్యవస్థకి ఎదురు నిలిచేవాడు యోధుడు, వ్యవస్థని చక్కదిద్దేవాడు నాయకుడు. చరిత్ర పుటల్లో చెప్పని విషయాలతో “ఒక్కడు మిగిలాడు”. అంటూ మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ ఫ్యాన్స్ లో సినిమా పట్ల సరికొత్త ఇంట్రెస్ట్ ని రేజ్ చేస్తుంది.

రెండు సరికొత్త క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేయనున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు వ్యవస్థకి విరుద్ధంగా పోరాడే వీరుడిగా, మరో వైపు ప్రస్తుత పరిస్థితుల మధ్య నలుగుతున్న వ్యవస్థను ట్రాక్ పై పెట్టే లీడర్ లా మంచు మనోజ్ నటిస్తున్న ఈ సినిమా అజయ్ ఆండ్రూస్ నూతక్కి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.

రొటీన్ కంటెంట్ కి దూరంగా ఉంటూ సరోకొత్త స్టోరీ లైన్స్, ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ తో ఎంటర్ టైన్ చేస్తున్న మంచు మనోజ్ కి ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది జీ సినిమాలు.