`రాజుగారి గది 2`తో సిద్దమవుతున్న ఓంకార్
Friday,August 26,2016 - 10:35 by Z_CLU
ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కాంబినేషన్ లో రాజుగారి గది2 సినిమాతో సిద్దమవుతున్నాడు. 2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. అందుకే ఓంకార్ మరో సారి అదే తరహా ఎంటర్టైన్మెంట్ తో ‘రాజుగారి గది-2’ చిత్రానికి రూపొందించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రాన్ని పివిపి సినిమా బ్యానర్ లో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు, నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తామని పివిపి సినిమా వర్గాలు చెబుతున్నాయి.