ఓంకార్ అక్టోబర్ సెంటిమెంట్

Wednesday,September 04,2019 - 12:02 by Z_CLU

ఈసారి రాజుగారి గది 3’ లో గత సిరీస్ కంటే కాసిన్ని హారర్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయనే అనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో సినిమాపై ఆ తరహా ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇకపోతే ఓంకార్ ఈ సారి కూడా అక్టోబర్ నే ఎంచుకున్నాడు. ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేయలేదు కానీ ‘దసరా’ అని ఫిక్సయ్యాడు కాబట్టి పక్కా అక్టోబర్ లోనే రిలీజవుతుంది ఈ సినిమా. ఈ సిరీస్ విషయంలో ఓంకార్ ఫస్ట్ నుండి అక్టోబర్ కే ఫిక్సయి ఉన్నాడు.

రాజుగారి గది – ఈ సినిమా తీసినప్పుడు కూడా ఇది ఇంత సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ అవుతుందని ఓంకార్ ఎక్స్ పెక్ట్ చేసి ఉండడు. 16 అక్టోబర్ న రిలీజ్ అయిందీ సినిమా. సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రాజుగారి గది 2 – నాగార్జున, సమంతా నటించారీ సినిమాలో. సమాంత వరకు వస్తే అప్పటి వరకు తన కరియర్ లో ప్లే చేసిన ది బెస్ట్ క్యారెక్టర్. 13 అక్టోబర్ ఈ సినిమా రిలీజ్ డేట్.

రాజుగారి గది 3 : అవికా గోర్ ఈ సినిమాలో దెయ్యంలా కనిపించనుంది. అశ్విన్ బాబు మరో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ ని కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్న ఓంకార్ ఈ సినిమాని దసరా కి రిలీజ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ తెలియాల్సి ఉంది.