అఫీషియల్ : ఆగ‌ష్టు 30న సాహో !

Friday,July 19,2019 - 12:10 by Z_CLU

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ పై   భారీ అంచనాలున్న విష‌యం తెలిసిందే. ఇండియాలో మెట్ట‌మెద‌టిసారిగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జితో తెరెకెక్కుతున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేశారు.

బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా  కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

హైస్టాండ‌ర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వ‌ర్క్ జ‌రుగుతుంది. అందుకే ‘ఇండిపెండెన్స్ డే’ని   వ‌దులుకుని  మేక‌ర్స్ ఆగ‌ష్టు 30కి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు.  పూర్తి క్రిస్ట‌ల్ క్లారిటి గా రెబ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా  ‘సాహో’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందని తెలియజేసారు.