Prabhas Radheshyam : వాయిదా పడిన పాన్ ఇండియా మూవీ

Wednesday,January 05,2022 - 12:26 by Z_CLU

ప్రస్తుతం మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల, అలాగే కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేత కారణం చేత భారీ సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన రాజమౌళి ‘RRR‘ రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా కూడా సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంది.  ప్రభాస్ ‘Radheshyam‘ సినిమా మరోసారి వాయిదా పడింది. జనవరి 14న రిలీజ్ అంటూ సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

RRR సినిమా పోస్ట్ పోన్ అంటూ మేకర్స్ చెప్పిన తర్వాత కూడా యూ.వీ. నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ‘రాధే శ్యామ్’ ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకే రిలీజ్ డేట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొన్నటి వరకూ సినిమాను జనవరి 14 నే థియేటర్స్ లోకి తీసుకురావాలని భావించారు. కానీ పరిస్థితులు సానుకూలంగా లేని కారణంగా సినిమాను వాయిదా వేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది నిర్మాతలకు.

అందుకే ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించి తమ సినిమాపై ఎంతో అభిమానం . ప్రేమ చూపిస్తున్న అభిమానులకు థాంక్స్ చెప్తూ అర్థం చేసుకోవాలని కోరారు. నిజానికి ‘రాధే శ్యామ్’ కొన్ని నెలల ముందు నుండి పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు సంక్రాంతి రేస్ లో నిలిచింది. అందుకే RRR రిలీజ్ కోసం మిగతా సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయినప్పటికీ ‘రాధే శ్యామ్’ ని మాత్రం వాయిదా వేయకుండా ఈసారి ఎలాగైనా థియేటర్స్ లోకి సినిమా తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు. కానీ ఇప్పుడు ఫైనల్ గా RRR తో పాటు Radheshyam కూడా వాయిదా పడి సినిమా అభిమానులను నిరాశ పరిచింది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics