అఫీషియల్: 'ఆచార్య'గా రాబోతున్న మెగాస్టార్

Monday,March 02,2020 - 11:12 by Z_CLU

కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మొదట ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. చివరిగా ‘ఆచార్య’ టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరు ఓ సినిమా వేదికపై అఫీషియల్ గా చెప్పారు.

‘ఓ పిట్ట కథ’ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా ఎటెండ్ అయిన చిరు తన సినిమా గురించి మాట్లాడుతూ ఫ్లో లో ఆచార్య అనే టైటిల్ ను మైక్ లో చెప్పేశారు. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులు అరుపులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

తనకు తెలియకుండానే టైటిల్ ప్రకటించేశాననే విషయాన్ని ఆ తర్వాత చిరంజీవి గ్రహించారు. “ఎక్కడ మిస్ అయ్యానో తెలియట్లేదు. కొరటాల శివ గారు దానికి ఓ ప్రోగ్రాం పెట్టుకొని అందంగా లాంచ్ చేద్దామనుకుంటే ఈ రకంగా నా నోటి ద్వారా లాంచ్ అయిపోయింది. సారీ శివ గారు ఏమనుకోవద్దు.. అయినా మంచి వార్తలు ఆపుకోలేం. దాన్ని ఆపడం కూడా కరెక్ట్ కాదంటూ” నవ్వుతూ అన్నారు మెగాస్టార్.