ఆఫీసర్ మూవీ అప్ డేట్స్

Tuesday,March 13,2018 - 02:57 by Z_CLU

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆఫీసర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ మూవీ షూటింగ్ 99శాతం పూర్తయినట్టు నాగార్జున ట్వీట్ చేశాడు. మొన్నటివరకు మహారాష్ట్రలో ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొన్న నాగార్జున హైదరాబాద్ వచ్చేశాడు. వర్మతో పాటు యూనిట్ మొత్తాన్ని మిస్ అవుతున్నట్టు ట్వీట్ చేశాడు.

అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు మిగతా యూనిట్ మాత్రం ఇంకా మహారాష్ట్రలోనే ఉంది. మిగిలిన ప్యాచ్ వర్క్ కూడా పూర్తిచేసుకొని అప్పుడు హైదరాబాద్ వస్తారు. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రారంభం కానుంది.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది ఆఫీసర్ సినిమా. నాగార్జున ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. వర్మ-ఆర్జీవీ కాంబోలో ఇది నాలుగో సినిమా. మే 25న ఆఫీసర్ సినిమా థియేటర్లలోకి రానుంది.