ZEE Cinemalu లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'

Thursday,September 14,2023 - 02:58 by Z_CLU

తెలుగు సిరీస్ లతో నిత్యం ఎంటర్టైన్ చేసే Zee5 లో వచ్చిన బ్లాక్ బస్టర్ సిరీస్ లలో  ‘ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ఒకటి. ఫ్యామిలీ ఎమోషన్స్ , ఫన్ , లవ్  అన్ని ఎలిమెంట్స్ తో కూడిన ఈ మిడిల్ క్లాస్ డ్రామా ఓటీటీ ఆడియన్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేసి రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్  సిరీస్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ సినిమా చానెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జీ సినిమాలు చానెల్ లో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సిరీస్ పూర్తి సినిమాగా వరల్డ్ టెలివిజన్ గా టెలికాస్ట్ గా అవ్వబోతుంది. ఇప్పటి వరకూ ఏ చానెల్ లో చూడని విధంగా ఓ సిరీస్ ను సినిమాగా ప్రసారం చేస్తూ కొత్తధనానికి ఎప్పటి లానే నాంది పలికింది జీ సినిమాలు. సంగీత్ శోభన్ , సిమ్రన్ శర్మ , తులసి , వీకే నరేష్ మెయిన్ లీడ్ గా కనిపించే ఈ సినిమాలో ఇంకా చాలా మంది యాక్టర్ ఎంటర్టైన్ చేస్తారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై నీహారిక కొణిదెల నిర్మించిన ఈ ఫన్ ఎమోషనల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది.

Miss Avvakunda Chudandi !