RRR Movie - భీమ్ వచ్చాడు.. దుమ్ముదులిపాడు
Thursday,October 22,2020 - 12:11 by Z_CLU
RRR నుంచి మరో టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NTR Teaserను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు. Komaram Bheem పాత్రలో ఎన్టీఆర్ మోస్ట్ ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు.
#RamarajuForBheem ట్యాగ్ లైన్ తో విడుదల చేసిన ఎన్టీఆర్ టీజర్ అదిరిపోయింది. ఎన్టీఆర్ లుక్, యాక్టింగ్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా.. ఇలా ఎందులో తీసిపోని విధంగా తెరకెక్కింది ఎన్టీఆర్ టీజర్.
ఇన్నాళ్లూ NTR ఫ్యాన్స్ ఎలాంటి టీజర్ కోసమైతే ఎదురుచూశారో, సరిగ్గా ఆ అంచనాల్ని అందుకునేలా వచ్చింది #RamarajuForBheem టీజర్.
ఇవన్నీ ఒకెత్తయితే టీజర్ కు రామ్ చరణ్ అందించిన వాయిస్ ఓవర్ మరో ఎత్తు. చరణ్ వాయిస్ గంభీరంగా, అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. రామ్ చరణ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ టీజర్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ ను తన అన్నగా చెప్పుకొచ్చాడు. ఈరోజు రిలీజైన టీజర్ లో ఎన్టీఆర్ ను రామ్ చరణ్ తమ్ముడు అని పిలిచాడు. సో.. RRRలో వీళ్లది అన్నదమ్ముల అనుబంధమన్నమాట.