#NTR31 - ప్రశాంత్ నీల్ సినిమా పక్కా చేసిన ఎన్టీఆర్

Thursday,May 13,2021 - 03:44 by Z_CLU

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ‘RRR’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ తన ల్యాండ్ మార్క్ #NTR30 ని కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఎనౌన్స్ అయిన ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా చెప్పేశాడు ఎన్టీఆర్. ఓ హాలీవుడ్ మ్యాగజైన్ కి ఎక్స్ క్లూజీవ్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన తారక్ కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.

దీంతో ఈ కాంబో సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ సంబరపడిపోతూ #NTR31 ట్యాగ్ తో పవర్ ఫుల్ కాంబో అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. నిజానికి ఈ కాంబోలో ఈ పాటికే సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి. KGF చాప్టర్ 2 తర్వాత ప్రశాంత్ తో సినిమా లాక్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఎప్పుడో బయటపెట్టారు. కానీ ప్రశాంత్ మధ్యలో ప్రభాస్ తో సినిమా చేయాల్సి వచ్చింది. దీంతో తారక్ తో సినిమా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఇప్పుడు తమ మార్క్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు తారక్ అండ్ ప్రశాంత్.

ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్’ సినిమాను పూర్తి చేసే లోపు తారక్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాను సినిమాను ఫినిష్ చేస్తాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి రాగానే ఈ కాంబో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది. వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics