NTR30 క్రేజీ మూవీ గ్రాండ్ గా లాంచ్
Thursday,March 23,2023 - 02:31 by Z_CLU
ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NTR30 ఈరోజు గ్రాండ్ గా లాంచ్ అయింది. కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ ఓపెనింగ్ సినీ ప్రముఖుల మధ్య ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి , రాజమౌళి , ప్రశాంత నీల్ , దిల్ రాజు , శిరీష్ , మైత్రి నవీన్ , నాగ వంశీ లతో పాటు చాలా మండి నిర్మాతలు హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్ కొరటాల శివ , ఎన్టీఆర్ లకు అందించగా రాజమౌళి ఎన్టీఆర్ , జాన్వి కపూర్ లపై క్లాప్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించారు. హైదరాబాద్ ITC కోహినూర్ హోటల్ లో ఈ ప్రారంభ వేడుక జరిగింది.
” ఎన్టీఆర్ గారితో రెండో సినిమా. జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ ఆయనతో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా ఉంది. కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన కథ. ఈ కథలో మనుషులకంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. భయం అంటే ఏమిటో తెలియని మృగాలు. దేవుడన్నా , చావన్నా భయంలేదు. కానీ ఒకే ఒక్కటంటే భయం వాళ్ళకి , ఆ భయమెంటో మీకు తెలిసే ఉంటుంది. భయపడాలి , భయపెట్టడానికి నా ప్రదాన పాత్ర ఎంత దూరమైన వెళ్తుంది. సినిమా ఎమోషనల్ రైడ్ గా ఉండనుంది. ప్రాజెక్ట్ చాలా పెద్దగా ఉండబోతుంది. ఇది కెరీర్ బెస్ట్ వర్క్ అవుతుందని అందరికీ ప్రామిస్ చేస్తున్నా” అంటూ సినిమా స్టోరీ లైన్ చెప్పేసి సినిమాపై భారీ హైప్ పెంచారు కొరటాల.


- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics