ఎన్టీఆర్ కొత్త సినిమాకు డేట్ ఫిక్స్

Saturday,January 28,2017 - 02:12 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూసిన ఫాన్స్ కి ఆ గుడ్ న్యూస్ ఎట్టకేలకి చెప్పేసాడు నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్-బాబీ కాంబినేషన్ లో నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు కళ్యాణ్ రామ్.

ntr-27
యంగ్ టైగర్ తొలిసారి కళ్యాణ్ రామ్ నిర్మాణం లో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ లో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా విషయం లో ప్రత్యేక జాగ్రత్త వహిస్తున్నాడట కళ్యాణ్ రామ్. కథ నుంచి సెట్స్ వరకూ స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకెళ్తున్న కళ్యాణ్ రామ్ ప్రెజెంట్ ఎన్టీఆర్ కు హీరోయిన్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎట్టకేలకి ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.