సింగం దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా..?

Wednesday,November 16,2016 - 10:00 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే తన కొత్త సినిమాను ప్రకటించబోతున్నాడు. ఈ మేరకు కథాచర్చలు కూడా ముగిశాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే తమిళ దర్శకుడు హరి తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత ఇప్పటివరకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు ఎన్టీఆర్. పూరి జగన్నాధ్, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి లాంటి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ… ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు దర్శకుడు హరి పేరు తెరపైకి వచ్చింది.
ntr-hari
సూర్యతో ఆరు, విశాల్ తో పూజ‌, విక్రమ్ తో స్వామి లాంటి సినిమాలను డైరక్ట్ చేశాడు హరి. ఇవన్నీ మాస్ సినిమాలే. ఆకట్టుకునే క‌థ‌తో పాటు… కట్టిపడేసే స్క్రీన్ ప్లే రాసుకోవడంలో హరి ఎక్స్ పర్ట్.  అంతేకాదు..మాస్ లుక్‌లో హీరోను చూపించ‌డం అత‌ని మ‌రో స్పెషాలిటి. ఈ క్వాలిటీసే హరికి.. ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చేలా చేశాయని చెబుతున్నారు. ప్రస్తుతం రూమర్ స్టేజ్ లోనే ఉన్న ఈ సినిమా… కన్ ఫం అవ్వాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.