రాఘవేంద్రరావు దర్శకత్వంలో...?

Friday,October 07,2016 - 06:21 by Z_CLU

జనతా గ్యారేజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అందరి దృష్టి పడింది. అయితే తారక్ మాత్రం మరో సినిమా ఎనౌన్స్ చేయకపోవడంతో… రోజుకో రూమర్ పుట్టుకొస్తోంది. మొన్నటివరకు వక్కంతం వంశీ, లింగుస్వామి, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల పేర్లు చక్కర్లు కొట్టగా… తాజాగా ఈ జాబితాలోకి ఏకంగా దర్శకేంద్రుడి పేరునే చేర్చేశారు పుకారురాయుళ్లు.

    అవును… కె.రాఘవేంద్రవేరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం నాగార్జున లీడ్ రోల్ లో ఓం నమోవేంకటేశాయ సినిమాను డైరక్ట్ చేస్తున్న రాఘవేంద్రరావు.. ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే.. తారక్ హీరోగా.. ఓ బిగ్ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారట. అది సోషియోఫాంటసీ లేదా పురాణాలకు సంబంధించిన ఓ కథతో ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. తారక్ తన కొత్త సినిమా ఎనౌన్స్ చేసేవరకు ఈ రూమర్లు ఇలా పుట్టుకొస్తూనే ఉంటాయి.