ఎన్టీఆర్ నుంచి ఒకేసారి 2 సినిమాలు

Wednesday,November 23,2016 - 10:10 by Z_CLU

జనతా గ్యారేజ్ తర్వాత సైలెంట్ అయిపోయిన ఎన్టీఆర్, త్వరలోనే ఒకేసారి 2 సినిమాలు ప్రకటించబోతున్నాడట. ఈ విషయాన్ని యంగ్ టైగర్ సన్నిహితులు స్పష్టంచేస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్… మరికొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఈ గ్యాప్ లో చాలామంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు ఎన్టీఆర్. తాజాగా దర్శకుడు బాబి చెప్పిన కథ కూడా విన్నాడు. వీటన్నింటినీ ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టాడు.
ntr-bobby
తాజా సమాచారం ప్రకారం… ఎన్టీఆర్ మరో 3 వారాలు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఆ తర్వాత ఒకేసారి 2 సినిమాల్ని ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వాటిలో బాబి చెప్పిన సినిమా కథ ఉంటుందా ఉండదా అనేది డౌట్. ఇప్పటికే రవితేజకు ఓ స్టోరీలైన్ వినిపించి, ఆఖరి నిమిషంలో ఆ ప్రాజెక్టు ఆగిపోవడంతో డల్ అయిపోయాడు బాబి. ఇప్పుడు యంగ్ టైగర్ ప్రాజెక్టు కనుక ఓకే అయితే, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత మరో బడా ప్రాజెక్టు అందుకున్నట్టు అవుతుంది.