కొరటాల దర్శకత్వంలో మరోసారి!

Tuesday,June 18,2019 - 03:01 by Z_CLU

అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్-ఆర్-ఆర్’ తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో మూవీ చేయబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం ఈ లిస్ట్ లో కొరటాల పేరు మాత్రమే వినిపిస్తోంది.

లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయిన తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తాడట. గతంలో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతాగ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడే వీళ్లిద్దరూ కలిసి మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు కొరటాల. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది. ఈ గ్యాప్ లో ఆర్-ఆర్-ఆర్ ను పూర్తిచేస్తాడు ఎన్టీఆర్. కొరటాల బెస్ట్ ఫ్రెండ్స్ ఈ సినిమాతో నిర్మాతలుగా ఇంట్రడ్యూస్ అవుతారట.