త్వరలోనే ఎన్టీఆర్ తో అదుర్స్ 2

Tuesday,September 12,2017 - 10:06 by Z_CLU

యంగ్ టైగర్ – వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన అదుర్స్ ఎలాంటి వసూళ్లు సాధించిందో.. ఏ రేంజ్ లో హిట్ అందుకుందో .. తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సిక్వెల్ రెడీ చేసే పనిలో పడ్డాడు వినాయక్. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఎన్టీఆర్ తో అదుర్స్ 2 త్వరలోనే ఉంటుంది అని అనౌన్స్ చేసిన వినాయక్ లేటెస్ట్ గా ఈ సినిమా పై మళ్ళీ స్పందించాడు.

ఇటీవలే ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినాయక్ ను ఫాన్స్ అదుర్స్ 2 ఎప్పుడు అని ప్రశ్నించగా.. త్వరలోనే అదుర్స్ 2 చేస్తాం.. మళ్ళీ అలాంటి ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ కోసం నేను తారక్ ఇద్దరం వెయిట్ చేస్తున్నాం.. అంటూ ఆ ఈవెంట్ లో ఉన్న కోనా ను ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేయొచ్చు కదా.. కోనా అంటూ అడుగుతూ అదుర్స్ 2 గురించి మాట్లాడాడు వినాయక్.

ప్రస్తుతం ఓ ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ తో వరుసగా మూడు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్ నాలుగో సినిమాగా వినాయక్ తో అదుర్స్ 2 చేసే ఛాన్స్ ఉంది.